Post Office GDS Recruitment 2024 – Apply Now | Post Office Careers
భారత తపాలా శాఖ దేశ వ్యాప్తంగా 44,228 ఉద్యోగాలకు నోటివికేషన్ విడుదల చేసింది. GDS (గ్రామీణ డాక్ సేవక్). ఈ ఉద్యోగం పొందాలంటే ఏ విధమైన రాత పరీక్ష రాయనవసరం లేదు. ఇది కేవలం 10 వ తరగతి మార్కుల ఉత్తీర్ణతతో ఇవ్వడం జరుగుతుంది. ఏ విధమైన పరీక్ష లేనందున ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్ కు అప్లయ్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ తో పాటు క్రింద ఇండియన్ పోస్ట్ ఆఫీసు యొక్క అఫిషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వబడును గమనించగలరు.
పదవ తరగతి మెరిట్ ఆధారంగా ఈ GDS ఉద్యోగాలను ఇవ్వబడతాయి. ఈ నోటిఫికేషన్ కు ఎక్కువగా పురుషులతో పాటు స్త్రీలు కూడా అప్లయ్ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలను క్రింద ఇవ్వబడినవి.
GDS యొక్క విద్యా అర్హత
ఉత్సాహవంతులైన యువతీ యువకులు పదవ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు కలిగి ఉండి. ఉద్యోగం పై పూర్తి అవగాహణ కలిగి ఉండాలి.అంతేకాకుండా ప్రాథమిక కంప్యూటర్ నాలెడ్జ్ మరియు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
GDS యొక్క వయో పరిమితి:
గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగానికి 18 నుండి 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఇంక రిజర్వేషన్ అయితే దివ్యంగులకు 10 సంవత్సరములు SC – ST లకు 5 సంవత్సరములు OBC లకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
GDS యొక్క పోస్టుల మరియు జీత భత్యాలు:
పోస్టులు మొత్తం 44,228 గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కు 1355 పోస్టులు మరియు తెలంగాణ రాష్ట్రం కు 981 పోస్టులు మంజూరు చేయబడ్డాయి.
BPM బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు 12,000 రూ నుండి 29,000 జీతం మరియు ABPM అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ పోస్టు కు 10,000 నుండి 24,000 రూ వరకు జీతం ఇవ్వబడుతుంది.
GDS యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వివరాలు :
GDS అప్లికేషన్ దరఖాస్తు 15-07-2024 నుండి అందుబాటులోకి వచ్చింది.అప్లికేషన్ కు ఆఖరి తేదీ. 5-08-2024 వరకు . సవరణ తేదీ 06,08 ఆగస్టు న సవరణలు చేసుకోవచ్చును.
ఈ పోస్టులకు SC,ST మరియు మహిళలు మినహా జనరల్ వాళ్ళు 100 రుసుముని చెల్లించవలసి ఉంటుంది.
ఈ రిక్రూట్మెంట్ కు ఆఫ్లైన్ లోనే కాకుండా ఆన్లైన్ లో మొబైల్ లో కూడా అప్లయ్ చేయవచ్చును. అప్లయ్ మరియు ఇతర వివరాలకు క్రింద ఇచ్చిన లింకు ను క్లిక్ చెయ్యండి.
▪️ మొత్తం ఖాళీలు: 44228
పోస్టులు:
▪️బ్రాంచి పోస్ట్ మాస్టర్ (BPM)
▪️ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM)
▪️ డాక్ సేవక్
▪️ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15-07-2024.
▪️దరఖాస్తు చివరి తేదీ: 05-08-2024.
జీతభత్యాలు: నెలకు బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్/ డాక్ సేవక్ పోస్టుకు రూ.10,000 నుంచి 5.24,470.
▪️విద్యార్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.